: ఈ నెల 23న టీడీపీలో చేరతా: జేసీ


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకరెడ్డి టీడీపీలో చేరేందుకు తేదీ ఖరారైంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఆ తర్వాత తన అనుచరులు కూడా పార్టీలో చేరతారని చెప్పారు. టీడీపీ నాయకత్వాన్ని బలపరచడానికి తాము సిద్ధంగా ఉన్నామని జేసీ వెల్లడించారు. అనంతపురం పట్టణానికి పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమని స్పష్టం చేశారు. చంద్రబాబు దూరదృష్టి ఉన్న నేత అని ప్రశంసించారు. ఈనెల 23 తర్వాత కాంగ్రెస్ పరిస్థితి జీరో అని, ఆ పార్టీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబుకు తప్పక మద్దతివ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News