: తెలంగాణలో ఆటోలపై రవాణా పన్ను మాఫీ: కేసీఆర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆటోలపై రవాణా పన్ను మొత్తం మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ హామీ ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. పోలీసులు, రవాణాశాఖ అధికారుల వేధింపులు లేకుండా చేస్తామని చెప్పారు. కాగా, పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో ఉంచాలని డిమాండ్ చేశారు. వాటిపై చంద్రబాబు ఏం చెబుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును యధాతథంగా నిర్మిస్తే వ్యతిరేకిస్తామన్నారు.