: వాట్సనే మా తురుపుముక్క: బెయిలీ


టి20 వరల్డ్ కప్ లో తమ తురుపుముక్క షేన్ వాట్సనే అని ఆసీస్ టి20 కెప్టెన్ జార్జ్ బెయిలీ అంటున్నాడు. వాట్సన్ లోని వైవిధ్యం జట్టు ప్రస్థానంలో అమోఘంగా తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపాడు. మీడియాతో మాట్లాడుతూ, మినీ ఫార్మాట్లో వైవిధ్యమే ప్రధాన ఆయుధమని బెయిలీ అభిప్రాయపడ్డాడు. కాగా, పేసర్ మిచెల్ జాన్సన్ గైర్హాజరీలో కంగారూలు ఇటు బౌలింగ్ లోనూ వాట్సన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. వాట్సన్ ఇప్పటికీ 138 కిమీ వేగం తగ్గకుండా బౌలింగ్ చేయడం సంతృప్తికరంగా భావిస్తున్నామని బెయిలీ తెలిపాడు.

  • Loading...

More Telugu News