: యూట్యూబ్ లో కేజ్రీవాల్ పేరడీ వీడియో హల్ చల్
పార్టీ పెట్టిన ఏడాదికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం. కేవలం రెండు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగిన కేజ్రీ ధర్నాలు, ఆందోళనలు చేసి కొత్త అధ్యాయానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను, ఆయన విధానాలను అనుకరిస్తూ కొంతమంది చిన్నారులు తయారుచేసిన ఓ పేరడీ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షా 30వేల మంది పైగా యూట్యూబ్ ప్రేక్షకులు వీక్షించారు.