: కేసీఆర్ ను రాజకీయాల నుంచి తరిమికొడతాం: మంద కృష్ణ
కుల రహిత సమాజం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను మూసివేస్తామన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. దొరల రాజ్యాధికారం కోసమే హాస్టళ్లను కేసీఆర్ మూసివేస్తామని అన్నారని ఆరోపించారు. హాస్టళ్లను మూసివేస్తే కేసీఆర్ ను రాజకీయాల నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. కుల నిర్మూలన అనేది కేసీఆర్ ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు.