: పీఎం, సీఎం ఫండ్స్ నుంచి నిధుల విడుదలకు ఈసీ 'నో అబ్జెక్షన్'
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆపన్నులకు ఎన్నికల సంఘం తియ్యటి కబురు వెల్లడించింది. పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి అవసరమైన వారికి నిధులు విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ప్రభుత్వ అధికారులు లబ్దిదారులను నిర్ధారించుకున్న తర్వాతే వైద్య చికిత్సకు అవసరమైన నిధులను విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.