: రాహుల్ పై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు


మహారాష్ట్రలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. మహాత్మా గాంధీ హత్య కేసును ఆరెస్సెస్ తో లింకు పెడుతూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆర్ఎస్ఎస్ ఈ మేరకు కోర్టును ఆశ్రయించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమని, వెంటనే చర్యలు తీసుకోవాలని భివాండీలోని ఆర్ఎస్ఎస్ యూనిట్ కార్యదర్శి రాజేష్ కుంటే ఈ మేరకు ఫిర్యాదులో కోరారు. ఈ నెల ఆరున మహారాష్ట్రలోని సొనాలెలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన రాహుల్, గాంధీజీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చంపారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News