: ఆ నియోజకవర్గంలో భార్యాభర్తలే ప్రత్యర్థులు
ఎన్నికల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, దగ్గరి బంధువులు ప్రత్యర్థులుగా తలపడిన ఘటనలు కోకొల్లలు. కానీ ఒకే కుటుంబంలోని భార్యా భర్తలు ప్రత్యర్థులుగా తలపడడం అరుదుగా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లోని అల్లర్ల కేంద్రం ముజఫర్ నగర్ లో భార్యాభర్తల మధ్య పోటీ నెలకొంది. బీఎస్పీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కదిర్ రాణాపై అయన సతీమణి షాహిదా బేగమ్ పోటీకి దిగనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
కదిర్ రాణా బీఎస్పీ అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముజఫర్ నగర్ అల్లర్లకు సంబంధించి సిట్ ఛార్జిషీటులో పేర్కొన్న 10 మందిలో రాణా ఒకరు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినందుకు ఆయనపై దర్యాప్తు జరుగుతోంది. ముజఫర్ నగర్ లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 10న పోలింగ్ జరుగనుంది. భార్యాభర్తల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో మే 16 వరకు చూడాల్సిందే.