: లోక్ సభకు స్పీకర్ మీరా కుమార్ నామినేషన్
బీహార్ లోని ససారమ్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికలకు స్పీకర్ మీరా కుమార్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. నామినేషన్ సమయంలో మాట్లాడిన స్పీకర్, ప్రజలు తనకు మద్దతు తెలిపి ఓటు వేస్తారని నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.