: వీడు తండ్రా?... ఛీఛీ!
కంచే చేను మేస్తే ఇక ఆ చేనుకు దిక్కేమిటి?
అండగా నిలబడాల్సిన తండ్రే కాటేస్తే ఆ కన్న బిడ్డకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది?
మూడేళ్లపాటు కొనసాగిన కన్నతండ్రి అఘాయిత్యాన్ని పంటిబిగువున భరించిన ఆమె, పెళ్లయ్యాక కూడా పునరావృతమవ్వడంతో తిరగబడింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నతండ్రి కీచక వృత్తాంతాన్ని వివరించింది. రాజస్థాన్ లోని కోటాలో దినేష్ సోనీ(51)కి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు 21 ఏళ్లు. జనవరిలో పెళ్లయి అత్తారింట్లో ఉంటోంది. హోలీ పండుగను పురస్కరించుకుని పుట్టింటికి వచ్చింది.
కామాంధుడైన తండ్రి ఆమెపై అత్యాచారయత్నం చేయగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు 9 ఏళ్ల వయస్సు నుంచి 12 ఏళ్ల వయసు వరకు మూడేళ్లపాటు తన తండ్రి చేసిన దాష్టీకాన్ని పోలీసులకు వివరించింది. మూడేళ్ల పాటు తనపై అత్యాచారం చేసిన సంగతి తన కుటుంబ సభ్యులకు కూడా తెలుసని పోలీసులకు ఆమె వివరించింది. దీంతో ఐపీసీలోని వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.