: 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున
దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా ప్రసిద్ధికెక్కిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' (కేబీసీ) కార్యక్రమానికి ఇకపై టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. 'కేబీసీ' తాజా సీజన్ కు సంబంధించి షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. తెలుగు చానల్ 'మా టీవీ' వాటాలను సోనీ నెట్ వర్క్ చేజిక్కించుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం 'మా టీవీ'లోనూ ప్రసారం కానుంది.