: బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కష్టమేనంటున్న శరద్ పవార్


ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్నికల ఫలితాలపై అభిప్రాయాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేనని, ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదని చెప్పారు. తానేమీ జ్యోతిష్యుణ్ణి కానని, అయితే బీజేపీకి ఆధిక్యం దక్కబోదన్న విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పగలనని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

'2004లో ఏం జరిగింది? భారత్ వెలిగిపోతోందంటూ వాజ్ పేయి అంతటి శిఖర సమానుడైన నాయకుడిని ప్రజల్లోకి పంపినా బీజేపీకి ఓటమి తప్పలేదు' అని వివరించారు. కాగా, తాము వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసే ప్రసక్తేలేదని, కాంగ్రెస్ తో జతగా బరిలో దిగుతామని పవార్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News