: సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో


కాసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎన్నికల మేనెఫెస్టో కమిటీ సమావేశం ముగిసింది. సమావేశానంతరం ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా మేనిఫెస్టో ముసాయిదా సిద్ధమవుతుందని చెప్పారు. మరో వైపు కిరణ్ పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. రాష్ట్రాన్ని చివర్లో పరిపాలించిన వారి వల్లే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని ఆరోపించారు. దీనికితోడు, రాష్ట్ర విభజన కూడా తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.
ఆనం తెలిపిన వివరాల ప్రకారం సీమాంధ్ర మేనిఫెస్టోలో ఉండబోయే కొన్ని అంశాలు.
* రాయలసీమలో గనుల సద్వినియోగానికి కృషి.
* రాజధానితో రాష్ట్రంలోని 13 జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ.
* అన్ని జిల్లాలకు అందుబాటులో రాజధాని.
* ఇచ్ఛాపురం నుంచి తడ వరకు కోస్టల్ కారిడార్.
* వ్యవసాయానికి 9 గంటల విద్యుత్.
* కుటుంబానికి 30 కేజీల బియ్యం.

  • Loading...

More Telugu News