: మంట మొదలైంది
ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో వేడిమి అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకింది. భద్రాచలంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తుని, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ లలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.