: బీజేపీ డబుల్ గేమ్ ఆడింది: జైరాం రమేష్


టీఆర్ఎస్ పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చిందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సోనియాగాంధీ ఒత్తిడి వల్లే హైదరాబాదును యూటీ చేయలేదని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడిందని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో వైయస్ తెలంగాణ అంశంపై మాట్లాడితే, ఆయన కుమారుడు జగన్ మాత్రం సమైక్య రాగం అందుకున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News