: ఇరాక్ లో బాల్య వివాహాల బిల్లుపై రగడ
ఇరాక్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బాల్య వివాహాలు, వైవాహిక అత్యాచారాలను సమర్థించే బిల్లుపై దేశంలో రగడ నెలకొంది. ఈ బిల్లు షియా ముస్లిం నియమావళికి అనుకూలమని, దైనందిన వ్యవహార శైలికి ఎక్కడా విరుద్ధం కాదని కొందరు ఛాందసవాదులు మద్దతు పలుకుతుండగా, మహిళల హక్కులు కాలరాయడమే ఈ బిల్లు ఉద్దేశమని ఎన్నికల ముంగిట లౌకికవాదులు ఎలుగెత్తారు.
ఆ బిల్లులో ఏముందంటే... తొమ్మిదేళ్ళ వయసున్న బాలిక విడాకులు తీసుకోవచ్చట. దానర్థం... అంతకంటే చిన్న వయసులోనే ఆమె పెళ్ళి చేసుకోవచ్చు. దాంతోపాటే, భార్య అనుమతి లేకపోయినా ఆమెను బలవంతంగా అనుభవించే హక్కు పురుషుడికి కల్పించాలని బిల్లు సూచిస్తోంది.