: శేషాచలం మంటల్లో చిక్కుకున్న 300 మంది సిబ్బంది, మీడియా ప్రతినిధులు


శేషాచలం కొండల్లో పుట్టిన కార్చిచ్చు ఆరడం లేదు. మంటలు ఆంతకంతకూ పెరిగి అడవిని దహనం చేస్తున్నాయి. గాలి వాటానికి మంటలు మరింత వ్యాపిస్తున్నాయి. ఈ మంటలు ఆర్పేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫైరింజన్లలో నీరు ఖాళీ అవడంతో అగ్నిమాపక సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో 300 మంది సిబ్బంది, మీడియా ప్రతినిధులు మంటల్లో చిక్కుకుపోయారు. వీరిని అక్కడ్నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కాగా మరోవైపు కాకులకోన దగ్గరున్న పవన విద్యుత్ కేంద్రంలో ఉన్న గాలి మరలను మంటలు చుట్టుముట్టాయి. మంటల్ని ఆర్పేందుకు హెలికాప్టర్ వినియోగంపై అధికారులతో టీటీడీ ఈవో చర్చిస్తున్నారు. మంటల కారణంగా వేలాది హెక్టార్లలో అరుదైన కలప సర్వనాశనమైపోయింది. అభయారణ్యంలో నివాసముండే అరుదైన వన్యప్రాణులు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి.

  • Loading...

More Telugu News