: సంగక్కర, జయవర్ధనేలపై జయసూర్య ఆగ్రహం
టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించిన శ్రీలంక సీనియర్ ఆటగాళ్ళు కుమార సంగక్కర, మహేల జయవర్ధనేలపై జాతీయ చీఫ్ సెలెక్టర్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరూ తమ రిటైర్మెంట్ విషయాన్ని తనకు మాటమాత్రం చెప్పలేదని జయసూర్య తెలిపారు. ఇరువురితో తాను ఎంతో పారదర్శకంగా వ్యవహరించానని, వివాదాన్నెప్పుడూ కోరుకోలేదని స్పష్టం చేశారు.
మీడియాలో ఎన్నో కథనాలు వస్తుంటాయని, వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఏ పనీ చేయలేమని జయసూర్య అభిప్రాయపడ్డారు. సీనియర్ ఆటగాళ్ళకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చామని చెప్పుకొచ్చారు. కాగా, సంగక్కర 2015 తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటించడం తెలిసిందే.