: అద్వానీ పోటీ చేసే స్థానంపై బీజేపీ సమాలోచనలు
భారతీయ జనతాపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటివరకు బీజేపీ కొన్ని లోక్ సభ టిక్కెట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా మిగిలివున్న లోక్ సభ స్థానాల్లో ఎవరిని బరిలో నిలపాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే, ఆ పార్టీ అగ్రనేత అద్వానీ ఏ స్థానం నుంచి పోటీచేయాలన్న దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు.