: జనసేన టీడీపీకి మద్దతివ్వాలి: నటుడు వేణుమాధవ్


ఆంధ్రప్రదేశ్ లో తాను ఎక్కడ నుంచైనా పోటీ చేయగలనని... తనకు అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారని సినీ నటుడు వేణుమాధవ్ చెప్పారు. రెండు దశాబ్దాలకు పైగా తనకు టీడీపీతో అనుబంధం ఉందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన అనంతరం వేణుమాధవ్ మీడియాతో మాట్లాడారు. 2009లో తాను కోదాడ నుంచి పోటీ చేయాలని భావించలేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ టీడీపీకి మద్దతివ్వాలని మన:స్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఈ రెండు పార్టీల లక్ష్యం, విధానాలు ఒకటే కనుక... రెండు పార్టీలు కలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News