: అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ పామర్రు ఎమ్మెల్యే దాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉమ్మడిగా ఎన్నికలు నిర్వహించి రెండు రాష్ట్రాలకు ప్రతినిధులను పంపడమనేది రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ధర్మాసనం, రేపు తమ ఎదుట హాజరుకావాలని, సమగ్ర వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారిని ఆదేశించింది.