: మనమింకా మధ్యయుగంలోనే ఉన్నామా!


మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నేటికాలంలోనూ కొన్ని సందేహాలు పొడసూపుతున్నాయి. మనమింకా మధ్యయుగంలోనే ఉన్నట్టు, తాలిబాన్ తరహా మూర్ఖులు మనపై పెత్తనం చేస్తున్నట్టు అనిపించకమానదు ఇలాంటి ఘటనలు వింటుంటే. మొన్న హోలీ సందర్భంగా పాటియాలాలోని పంజాబీ యూనివర్శిటీలో అమ్మాయిల హాస్టళ్ళకు తాళాలు వేశారు.

వసంతోత్సవ వేడుక నాడు అమ్మాయిలు బయటికొస్తే న్యూసెన్స్ అవుతుందని వర్శిటీ అధికారులు విద్యార్థినులు బస చేసే ఆరు హాస్టళ్ళ గేట్లకు తాళాలు వేసి తమ మూర్ఖత్వాన్ని చాటుకున్నారు. ఆ రోజు సాయంత్రానికి తాళాలు తీస్తేనే గానీ, పాపం, ఆ విద్యార్థినులు బయటికి రాలేకపోయారు. అదీ ఓ గంటపాటేనట. మళ్ళీ తాళాలు వేసి అమ్మాయిలను ఉసూరుమనిపించారు.

తమ నిర్బంధంపై కొందరు మహిళా పీహెచ్ డీ స్కాలర్లు వర్శిటీ అధికారులను ప్రశ్నించగా, హోలీ రోజు అమ్మాయిల హాస్టళ్ళకు తాళాలు వేయడం ఏళ్ళుగా అనుసరిస్తున్న విధానమని దిమ్మదిరిగే సమాధానం చెప్పారు. ఇప్పుడు మీకోసం ఆ విధానం మార్చుకోబోమని ముక్తాయించారా మూర్ఖ శిఖామణులు!

  • Loading...

More Telugu News