: చెన్నై ఐపీఎల్ మ్యాచ్ లు యధాతధం


శ్రీలంక తమిళుల సమస్యతో తమిళనాడు అట్టుడుకుతున్న తరుణంలో, షెడ్యూల్ ప్రకారం చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లు యధాతధంగా జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. లంక ఆటగాళ్ళు గానీ, అంపైర్లు గానీ పాల్గొంటున్న మ్యాచ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ చెన్నైలో నిర్వహించేందుకు అనుమతించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తేల్చిచెప్పిన నేపథ్యంలో శుక్లా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఐపీఎల్ మ్యాచ్ ల విషయంలో జయ.. ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, ఆటగాళ్ళ భద్రతపై లంక క్రికెట్ బోర్డు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేశామని శుక్లా తెలిపారు. ఆటగాళ్ళ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News