: విమానం ఏమైందో సరిగ్గా చెప్పండి... సంగతేంటో మేమే తేల్చుకుంటాం: ప్రయాణికుల బంధువులు


మలేసియా విమానం ఏమైందో సరిగ్గా చెప్పాలని, లేకుంటే నిరాహార దీక్షకు దిగుతామని తప్పిపోయిన విమానంలో చైనీయుల బంధువులు హెచ్చరించారు. బీజింగ్ లో వారు మాట్లాడుతూ, విమానం ప్రమాదంపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోందని, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నామని, వాస్తవాలు మలేసియా ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజింగ్ లోని మలేసియా రాయబార కార్యాలయానికి వెళ్లి తామే తేల్చుకుంటామని హెచ్చరించారు. విమానం అదృశ్యం ఘటనపై 26 దేశాలు విమానాలు, నావలతో వెతుకుతున్నాయి. అయినప్పటికీ విమానం ఆచూకీ లభ్యం కాకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News