: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ రమణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సతీసమేతంగా ఈరోజు (బుధవారం) ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గగుడికి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయనకు కనకదుర్గ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.