: శారదా నదిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం
శారదా నదిలో ఈతకు దిగి కనిపించకుండా పోయిన ముగ్గురు యువకులు మృతి చెందారు. విశాఖ జిల్లా, అనకాపల్లి సమీపంలోని తుమ్మలపాలెం వద్ద వారి మృతదేహాలను కనుగొన్నారు. చనిపోయిన ముగ్గురూ ఇంజనీరింగ్ చదువుతున్నారని... వీరిని అహ్మద్, మురళి, పృధ్వీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
శారదా నదిలో ఈతకు వెళ్లిన వీరు గల్లంతయ్యారు. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.