: తిరుమల శేషాచలం కొండల్లో ఎగిసిపడుతున్న మంటలు
తిరుమల శేషాచలం కొండల్లో మంటలు ఈ రోజు కూడా ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు రెండు ఫైరింజన్లు, ట్యాంకర్లతో ప్రయత్నిస్తున్నారు. వారం రోజుల కిందట తిరుపతి సమీపంలోని మంగళం వద్ద మంటలు చెలరేగి క్రమంగా సప్తగిరులకు వ్యాపించాయి. ప్రమాదంలో వేల హెక్టార్లలోని అరుదైన వృక్ష జాతులు, వన్య ప్రాణులకు భారీ నష్టం జరిగింది.