: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి జైరాం రమేష్
కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా మహబూబ్ నగర్ బయల్దేరారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ లలో ఈ రోజు ఆయన పర్యటిస్తారు. అంతే కాకుండా, అమరవీరుల కుటుంబాలతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. దీనికితోడు, సాయంత్రం 5 గంటలకు హైదరాబాదులో ఐకాస నేతలతో సమావేశమవుతారు.