: మిత్రుడి భౌతిక కాయాన్ని తరలించేందుకు విమానం ఏర్పాటు చేసిన రజనీ


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్నేహితుల పట్ల తన దృక్పథాన్ని చాటుకున్నారు. తన మిత్రుడి భౌతిక కాయాన్ని తరలించేందుకు ఆయన విమానాన్ని ఏర్పాటు చేశారు. కన్నడ చిత్ర దర్శకుడు, రజనీ మిత్రుడు రవీంద్రనాథ్ (63) ఆదివారం సాయంత్రం హైదరాబాదు రైల్వే స్టేషన్లో గుండెపోటుతో మరణించారు. రవీంద్రనాథ్ ఇప్పటికీ బ్రహ్మచారి కాగా, ఆయన సోదరులు కొందరు ముంబైలోనూ మరికొందరు వేర్వేరు ప్రాంతాల్లోనూ ఉంటున్నారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళేందుకు సకాలంలో ఎవరూ రాలేదు. మిత్రులకు అప్పగించేందుకు పోలీసులు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ మిత్రులు సోమవారం నాడు రజనీకాంత్ కు ఫోన్ చేసి విషయం వివరించగా, ఆయన వెంటనే స్పందించారు. తన పలుకుబడిని ఉపయోగించి మిత్రుడి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించడంలో సహాయపడ్డారు. ఓ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి రవీంద్రనాథ్ భౌతికకాయాన్ని అందులో బెంగళూరు పంపే ఏర్పాట్లు చేశారు. నిజంగా పెద్ద మనసు అంటే ఇదేనేమో!

కాగా, 70వ దశకంలో రజనీకాంత్, రవీంద్రనాథ్, కన్నడ నటులు అశోక్, హేమా చౌధరి ఒకే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో సినిమా కోర్సు అభ్యసించారు.

  • Loading...

More Telugu News