: యూపీఏకి ఊరట... ఫైళ్ళ గల్లంతు కేసు మూసివేతకు సీబీఐ నిర్ణయం!
కుంభకోణాలతో అట్టుడికిన యూపీఏ సర్కారుకు ఊరట! బొగ్గు స్కాంలో గల్లంతైన ఫైళ్ళ కేసును మూసివేయాలని తాజాగా సీబీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో క్రిమినల్ ఉద్దేశాలు ఏవీ తమ దృష్టికి రాలేదని, అన్ని ప్రధాన డాక్యుమెంట్లను పరిశీలించామని సీబీఐ అంటోంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు కూడా తెలిపేందుకు సీబీఐ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఈ కేసుకు సంబంధించి కొందరు అధికారులను సీబీఐ ప్రశ్నించింది.