: మోడీ ఎన్నటికీ ప్రధాని కాలేరు: మమత
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటల తూటాలు రువ్వారు. మోడీ ఎన్నటికీ ప్రధాని కాలేరని స్పష్టం చేశారు. కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల అనంతరం ఫెడరల్ ఫ్రంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీదీ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో నెగ్గుకురావడం మోడీకి ఏమంత సులభసాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. 'బీజేపీ అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతున్నారు. ఎన్నికలకు ముందే కొందరు 'నమో నమో' అంటున్నారు. మోడీ గెలుస్తాడంటే నేను అంగీకరించను' అని పేర్కొన్నారు.