: క్రిమియాలో భారత విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరం
క్రిమియా... రష్యాలో కలిసేందుకు సంసిద్ధత చూపడం ద్వారా ఉక్రెయిన్ సంక్షోభానికి ఓ రకంగా తెరపడినట్టే అని భావించినా... అక్కడి భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. క్రిమియా మెడికల్ యూనివర్శిటీలో 600 మంది భారత విద్యార్థులు ఉన్నారు. తాజాగా క్రిమియా నుంచి వీరందరినీ పంపేస్తారని, యూనివర్శిటీ మూతపడుతుందని పుకార్లు రావడంతో భారత విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
ఫాతిమా అనే విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ, ఇక మీదట తొలి మూడు సంవత్సరాలు రష్యా మాధ్యమంలో విద్యా బోధన ఉంటుందనీ, రష్యా వర్శిటీల షెడ్యూల్ కు అనుగుణంగా క్రిమియా వర్శిటీ కూడా మారాల్సి ఉంటుందనీ పుకార్లు వస్తున్నాయని తెలిపింది. అంతేగాకుండా, ఆరు నెలల్లో రష్యా వీసా తప్పక పొందాల్సి ఉంటుందన్న విషయం కూడా వీరిని ఆందోళనకు గురిచేస్తోంది.