: 'జంజీర్' ట్రైలర్ సూపర్: అమితాబ్ ప్రశంస


టాలీవుడ్ 'మగధీర' రామ్ చరణ్ నటించిన 'జంజీర్' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందంటున్నాడు 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్. అంతేగాకుండా.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. 1973లో అమితాబ్ హీరోగా వచ్చిన 'జంజీర్' కు తాజా చిత్రం రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో అమితాబ్ నటించిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక్కసారిగా బిగ్ బి క్రేజ్ ను అమాంతం పెంచేసింది.

తాజా రీమేక్ కూడా దుమ్ముదులపడం ఖాయమని అమితాబ్ అంటున్నాడు. 'చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా ఈ సినిమా ట్రైలర్ ను చూపించాడు. అదిరిపోయింది. చిత్ర యూనిట్ కు నా అభినందనలు' అంటూ అమితాబ్ ట్విట్టర్లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. రామ్ చరణ్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్. ఈ సినిమా తెలుగులో 'తుపాన్' పేరిట విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News