: 10 కిలోల పుత్తడి పట్టుబడింది
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేకుండా తీసుకెళుతున్న డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో 10 కిలోల బంగారం పట్టుబడింది. కోవూరు ఇనమడుగు చెక్ పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో 10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ఒంగోలు తీసుకువెళుతుండగా వీటిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.