: బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించింది టీడీపీయే: చంద్రబాబు


రోజు రోజుకీ తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి భారీగా టీడీపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు హర్షవర్షన్ రెడ్డి టీడీపీలో చేరారు. కొత్తగా టీడీపీలో చేరిన వారిని ఆయన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు.

టీడీపీ ప్రభంజనం చూసి రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కు నిద్రపోతున్నా టీడీపీనే గుర్తువస్తోందని ఆయన చెప్పారు. బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది టీడీపీయేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీకి నాయకత్వం ఉందని, తెలంగాణలో తిరుగు లేని మెజారిటీ సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉచిత నిర్భంధ విద్యను అమలు చేస్తామని బాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News