: మోడీ గుజరాత్ నుంచే పోటీ చేయాలి... ఇది ప్రజల కోరిక


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్ నుంచే పోటీ చేయాలన్న డిమాండ్లు నానాటికీ ఊపందుకుంటున్నాయి. మోడీ సొంత రాష్ట్రం నుంచే బరిలో దిగాలన్నది ప్రజలందరి కోరిక అని గుజరాత్ బీజేపీ శాఖ పేర్కొంది. ఈ మేరకు తాము అధినాయకత్వాన్ని కోరతామని రాష్ట్ర శాఖ తెలిపింది. నేడు అహ్మదాబాద్ లోని మోడీ నివాసంలో గుజరాత్ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. మోడీ గుజరాత్ బరిలో దిగాలన్నది ఆరు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, ఈ సందేశాన్ని తాము బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు తెలియజేస్తామని పార్టీ ప్రతినిధి విజయ్ రూపానీ పేర్కొన్నారు. మోడీ వారణాసి నుంచి పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News