: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆసీస్ క్రికెటర్ సారథ్యం
ఐపీఎల్-7లో పాల్గొనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆస్ట్రేలియా టి20 జట్టు సారథి జార్జ్ బెయిలీ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్న రెండో ఆస్ట్రేలియన్ బెయిలీనే. బెయిలీ కంటే ముందు ఆడమ్ గిల్ క్రిస్ట్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆటగాళ్ళ వేలంలో బెయిలీని పంజాబ్ ఫ్రాంచైజీ రూ.3.25 కోట్లు పోసి కొనుక్కుంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బెయిలీ ఆడిన తొలి మ్యాచ్ లోనే కెప్టెన్సీ వహించిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ ఆసీస్ క్రికెటర్ ఐపీఎల్ గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.