: తెలంగాణకు బీజేపీ సంపూర్ణ మద్దతు: జవదేకర్
తెలంగాణ అంశంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభలో తెలంగాణపై బిల్లు ప్రవేశపెట్టాలని జవదేకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.