: టీఆర్ఎస్ రాకముందు తెలంగాణ లేదు: కేసీఆర్


టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు తెలంగాణ పేరు కూడా ఉచ్చరించలేని దుస్థితిలో తెలంగాణ ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పేదల బతుకు మార్చేందుకు టీఆర్ఎస్ వచ్చిందని అన్నారు. అంతకు ముందు ఆంధ్రా భాషనే మాట్లాడే వాళ్లమని ఆయన తెలిపారు. తెలంగాణలో 85 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ ఒక్క గది ఉన్న ఇంటినే నిర్మించాయని, 125 గజాల స్థలంలో హాలు, వంటగది, బెడ్రూం ఉండేలా ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు.

దీనికి 2.75 లక్షల రూపాయలు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక్క రూపాయి రుణం లేకుండా బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హామీలు నెరవేర్చే బాధ్యత తనదేనని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కులాల పేరిట హాస్టళ్లు ఉండవని, అందరికీ ఒకే రకం సదుపాయాలతో హాస్టళ్లు ఉంటాయని, స్విమ్మింగ్ పూళ్లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News