: ఆ ఫోటో కథ ముగిసింది


రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన ఆనందంలో ఓ సైనికుడు నర్సును ముద్దు పెట్టుకున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ ఫోటోలోని నర్సు ఎడిత్ షేన్ 91 ఏళ్ల వయసులో నాలుగేళ్ల క్రితం మరణించగా, ఆ ఫోటోలోని సైనికుడు గ్లెన్ ఎడ్వర్డ్ మెక్ డఫీ తన 86వ ఏట ఈ నెల 9న మరణించాడు. 1945 ఆగస్టు 14న అమెరికా, బ్రిటన్ సేనలకు జపాన్ సేనలు లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.

వీజేడే(విక్టరీ ఆన్ జపాన్ డే)గా పిలుచుకునే ఆ రోజును అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రజలంతా గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. ఆ ఆనందంలో మెక్ డఫీ అక్కడ కనిపించిన చాలా మంది మహిళలను ఇలా ముద్దు పెట్టుకున్నాడు. అలా ఎడిత్ ను ముద్దు పెట్టుకుంటుండగా ఐసెన్ స్టాడిత్ క్లిక్ మనిపించి ప్రచురించాడు. దీంతో ఈ ఫోటోలోని వ్యక్తులు ఎవరా? అనే దానిపై చాలా చర్చ నడిచింది. 1970వ దశకంలో అందులోని నర్సు తానేనంటూ ఎడిత్ షేన్ బయట పెట్టింది.

ఆ తరువాత చాలా కాలానికి మెక్ డఫీ పేరు బయటపడింది. ఇందులో విశేషం ఏంటంటే, ఎడిత్, మెక్ డఫీ లకు అంతకు ముందు పరిచయం లేదు. ఆ తరువాత కూడా వారు కలుసుకోలేదు. ఇప్పుడిక వారిద్దరూ లేరు. వారి ఫోటో మాత్రం జ్ఞాపకంగా మిగిలిపోయింది.

  • Loading...

More Telugu News