: కొత్తగా ఆరు లక్షల మంది ఓటర్లు: భన్వర్ లాల్
ఓటర్ల జాబితాలో కొత్తగా ఆరు లక్షల మంది ఓటర్లు చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ చెప్పారు. తెలంగాణలో మార్చి 30వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని, జాబితాలో పేరు లేని వారు ఈ నెల 30లోగా నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.