: పాక్ ను విడిచివెళ్లిన జర్దారీ కుమారుడు బిలావల్


పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ దేశం విడిచి వెళ్లాడు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) వ్యవహారాల్లో తండ్రి జర్దారీ జోక్యం కారణంగా, ఈ తండ్రీ తనయుల మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన దుబాయ్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

కొద్దిరోజుల కిందటే పార్టీ అధ్యక్ష పదవి నుంచి జర్దారీ తప్పుకోవడంతో కొత్త అధ్యక్షుడిగా బిలావల్ ఎంపికయ్యాడు. మరోవైపు, మే 11న పాక్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బిలావల్ దేశాన్నివదిలివెళ్లడం పాక్ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.

  • Loading...

More Telugu News