: నాగార్జున సాగర్ లో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్రం


నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్రం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనా ఖాన్ ఈ కేంద్రం నిర్మాణానికి సోమవారం నాడు భూమిపూజ చేశారు. రాష్ట్ర పర్యాటక సంస్థ గౌరవ సలహాదారులు చెన్నూరి ఆంజనేయరెడ్డి, ప్రజ్ఞోపాయ బుద్ధిస్ట్ ఛారిటబుల్ కు చెందిన ప్రియదర్శిని బుద్ధుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ... ఈ కేంద్రం నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. బుద్ధవనంలో మెరుగైన ధ్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News