: కరీనా, ప్రియాంకలను కత్రీనా మించిపోయిందట!
బాలీవుడ్ అందాల తార కత్రీనా కైఫ్ ముందస్తు ఆదాయ పన్ను చెల్లించే విషయంలో తోటి హీరోయిన్లు కరీనా కపూర్, ప్రియాంక చోప్రాలను వెనక్కినెట్టింది. గతేడాది బాక్సాఫీసు వద్ద సందడి చేసిన కత్రీనా తాజా సంవత్సరానికి రూ. 4.5 కోట్లు ముందస్తు ఆదాయ పన్ను రూపంలో చెల్లించిందట. ఇక బాలీవుడ్ లో ఆమెకు ప్రధాన పోటీదారు కరీనా రూ. 4 కోట్లు, ప్రియాంక రూ. 2 కోట్లు ఆదాయ పన్ను కట్టారు.
కత్రీనా గతేడాది నటించిన 'ఏక్ థా టైగర్', 'జబ్ తక్ హై జాన్' సినిమాలు రూ. 100 కోట్ల వసూళ్ళను అధిగమించాయి. దీంతో, బాలీవుడ్ చిత్ర సీమలో కత్రీనా హవా జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కత్రీనా.. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న 'ధూమ్-3' షూటింగ్ లో పాల్గొంటోంది. ఆ సినిమా చిత్రీకరణ తాజాగా స్విట్జర్లాండ్ లో జరుగుతోంది.