: ఐక్యరాజ్యసమితి సాయం కోరిన ఇటలీ


ఇటలీకి చెందిన ఇద్దరు నావికులు కేరళ మత్స్యకారులను హత్య చేసిన కేసు రెండేళ్ల నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న నావికులపై మోపిన కొన్ని అభియోగాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో మరణశిక్ష తప్పింది. అయితే, ఈ కేసులో జోక్యం చేసుకోవాలంటూ ఇటలీ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిని సంప్రదించింది. కేసు ఎదుర్కొంటున్న మస్సిమిలియనో లాటోర్, సాల్వాటోర్ గిరోనెలను విడుదల చేయించాలని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News