: భారత్ లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు


భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పడుతుంటే భారత్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వెల్లడించారు. ఇది భారత్ కు ఓ హెచ్చరికే అని ఆయన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 31 వరకూ నిర్వహిస్తోన్న గ్లోబల్ అంకాలజీ సమిట్ ఆవశ్యకతను దత్తాత్రేయుడు వివరించారు. ఈ సదస్సు ద్వారా క్యాన్సర్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక చికిత్స విధానాలను తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని క్యాన్సర్ రోగులు ఉపయోగించుకోవాలని ఆయన ఇవాళ హైదరాబాద్ లో సూచించారు. 

  • Loading...

More Telugu News