: పురుగుల మందు డబ్బాతో తిరుగుతున్న టీడీపీ నేత
కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తనకు ఇంతవరకు బీఫారం ఇవ్వలేదని టీడీపీకి చెందిన రమాదేవి అనే మహిళ పురుగుల మందు డబ్బా పట్టుకుని నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. బీఫారం ఇచ్చేది తాము కాదని నాయకులు చెబుతున్నా ఆమె వినిపించుకోవడం లేదు. దీంతో అనంత టీడీపీ నాయకులు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు.