: కేసీఆర్ కు దిమ్మతిరుగుతుంది: దానం
రానున్న ఎన్నికల్లో ఫలితాలు చూసి కేసీఆర్ కు దిమ్మతిరుగుతుందని మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో దొరల రాజ్యం తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రయత్నాన్ని తాము అడ్డుకుంటామని ఆయన సవాలు విసిరారు. ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆయన గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.