: తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద రూ.7 లక్షలు స్వాధీనం
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాదులోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఓ కారులో తరలిస్తున్న రూ. 7 లక్షల నగదు పట్టుబడింది. సొమ్మును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.