: రైతులు వేసిన ఉచ్చులో పడిన చిరుత


కరీంనగర్ జిల్లాలో రైతులు వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది. బెజ్జంకి మండలంలో చిరుతపులి సంచారంతో రైతులు పొలం చుట్టూ ఉచ్చు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో అమ్మాజిపేట సమీపంలోకి నీటిని తాగేందుకు వచ్చిన చిరుత ఆ ఉచ్చులో పడింది. చిరుతను చూసిన గొర్రెల కాపరులు వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో చిరుతపులిని అధికారులు జంతు ప్రదర్శన శాల (జూ)కి తరలించారు.

  • Loading...

More Telugu News